శంకర్ పల్లి మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి
– 25 సంవత్సరాలు గడుస్తున్నా రీటెండర్ నిర్వహించిని అధికారులు
– నాయకుల ఒత్తిళ్లకు వ్యాపారస్తులకు వత్తాసు పలుకుతున్న అధికారులు
– మున్సిపల్ దుకాణ సముదాయాన్ని రిటెండర్లు నిర్వహించాలని కోరుతున్న స్థానికులు
శంకర్ పల్లి ఆగస్టు 22(ప్రజాక్షేత్రం):సంవత్సరాల నుండి మున్సిపల్ అయానికి గండి పడుతున్న అధికారులకు గాని నాయకులకు గాని ఎలాంటి చలనం లేకపోవడం పట్ల స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు అధికారులు మారుతున్నారు తప్ప మున్సిపల్ ఆదాయం పట్ల ఎవరు కూడా శ్రద్ధ చూపించడం లేదు.. గత 25 సంవత్సరాల క్రితం వ్యాపారస్తులకు దుకాణ సముదాయాన్ని కేటాయించి దుకాణాల కిరాయి కేవలం 500 నుండి 800 వసూలు చేస్తున్నారు… 25 సంవత్సరాలు నుండి రిటైడర్ నిర్వహించకపోవడంతో పాటు దుకాణాల కిరాయి పెంచకపోవడంతో స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించిన ఆర్టీసీ యొక్క దుకాణ సముదాయంలో ఒక దుకాణానికి 20వేల నుండి 30000 వరకు ఆర్టీసీ యాజమాన్యం అద్దె వసూలు చేస్తుంది.. కానీ శంకర్ పల్లి గ్రామపంచాయతీ ఉన్నప్పటి అధికారులు గాని ప్రస్తుతం మున్సిపల్ అధికారులు గాని అద్దె విషయంలో ఎలాంటి చలనం లేదు.. గతంలో ఉన్న కలెక్టర్లు మున్సిపల్ దుకాణ సముదాయాల అద్దె విషయంలో రి టెండర్ నిర్వహించలని ఆదేశాలిచ్చిన రాజకీయనాయకుల ఒత్తిళ్లకు అధికారులు ఏం చేయాలో తోచక వ్యాపారస్తులకి లాభం చేకూరుస్తున్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దుకాణ సముదాయాన్ని అన్ని వర్గాల వారికి కేటాయించాల్సి ఉండగా నిబంధనలను ఉల్లంఘించి ఒకే వర్గానికి దుకాణ సముదాయాలు కేటాయించి వారికే వత్తాసు పలుకుతున్నారు. 2018 సంవత్సరంలో గ్రామ పంచాయతీగా ఉన్న శంకర్ పల్లిని ఐదు గ్రామాలను కలుపుకొని మున్సిపాలిటీగా మార్చారు ఏడు సంవత్సరాలు గడుస్తున్న మున్సిపల్ దుకాణ సముదాయాలను రీ టెండర్ నిర్వహించకపోవడంతో మున్సిపల్ లో గల అన్ని గ్రామాల ప్రజలు నిరుద్యోగులు వ్యాపారస్తులు మోసపోతున్నారు. గతంలో ఉన్న అధికారులు తప్పనిసరిగా రీ టెండర్ నిర్వహించి అద్దె పెంచాలని సూచించిన రాజకీయ నాయకులు ఓట్ల కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రీ టెండర్లు నిర్వహించకుండా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం దుకాణాల సముదాయం 238 ఉండగా వాటి అద్దె 200 నుంచి 800 వరకు వసూలు చేస్తున్నారు పక్కనే గల ఆర్టీసీ సముదాయంలో అద్దె 30 వేలు ఉంటే మున్సిపాలిటీ దుకాణ సమయంలో ఇంత తక్కువ అద్దె వసూలు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఏ బి సి డి గా విభజించి అన్ని వర్గాల వారికి దుకాణాలు కేటాయించాల్సి ఉంటుంది కానీ అధికారులు గాని నాయకులు గాని వీడిపై ఎవరు నోరు మెదపడం లేదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతున్న దానిని గుర్తించి మున్సిపల్ దుకాణ సముదాలకు రీటెండర్ నిర్వహించి అన్ని వర్గాల వారికి దుకాణాలు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రిటెండర్లు నిర్వహించాలి
గత 25 సంవత్సరాలుగా దుకాణ సముదాయాలకు రిటైడర్ నిర్వహించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. సంవత్సరం తరబడి మున్సిపల్ ఆదాయానికి గడ్డి పెడుతున్న అధికారులు కాలయాపన చేస్తున్నారు ఉన్నతాధికారులు స్పందించి అన్ని వర్గాలకు దుకాణ సముదాయం కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి.
ఈశ్వర్ స్థానికుడు
