చందిప్ప మరకత శివాలయంలో అందెల రవమిది చిత్ర యూనిట్
శంకర్‌పల్లి సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ వారిలో వెలిసిన 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో అందెల రవమిది చిత్ర యూనిట్ బృందం శనివారం స్వామి వారికి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం నాట్య మార్గం ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత ఇంద్రాణి దావులూరి శివ భట్టిప్రోలు సమర్పణలో తెరకెక్కుతున్న అందెల రవమిది సినిమా పోస్టర్ ను ఆలయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు స్వామి చేతుల మీదుగా విడుదల చేశారు. ఆలయ నిర్వాహకులు చిత్ర యూనిట్ బృందానికి స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, చిత్రపటాన్ని బహుకరించారు. చిత్ర బృందం మాట్లాడుతూ ఈ సినిమా ఈనెల 19న థియేటర్లలో విడుదల కానుందని, అలాగే అమెజాన్ ప్రైమ్ ఓటీటిలో దసరాకు రాబోతుందని తెలియజేశారు. అయితే పోస్టర్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, రచయిత అమెరికా వాస్తవ్యులు ఐటీ రంగ నిపుణులు వేణు నక్షత్రం 30 సంవత్సరాల నుంచి అక్కడే స్థిరపడ్డారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, డబ్బింగ్ కళాకారిణి రైటర్ వ్యాఖ్యాత కృష్ణవేణి శఠగోపం, అర్చకులు ప్రమోద్, కమిటీ సభ్యుడు గోపాల్ ఉన్నారు.
