Praja Kshetram
క్రైమ్ న్యూస్

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు – రూ.12 వేల కోట్ల రూపాయల విలువ

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ గుట్టురట్టు – రూ.12 వేల కోట్ల రూపాయల విలువ

 

– చర్లపల్లి ఫ్యాక్టరీపై ముంబై పోలీసుల మెరుపుదాడి

– రూ. 12,000 కోట్ల విలువైన మెఫెడ్రోన్ స్వాధీనం

– ఫ్యాక్టరీ యజమాని సహా 12 మంది అరెస్ట్

– వాఘ్దేవి ల్యాబ్స్ పేరుతో నకిలీ లైసెన్స్‌తో దందా

– పలు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తింపు

చర్లపల్లి సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ చర్లపల్లి ఒక చిన్న ప్రాంతమే కానీ… అక్కడి నుండి వెలువడిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కెమికల్ ఫ్యాక్టరీ పేరుతో మాయ చేసి భారీ స్థాయిలో డ్రగ్స్ తయారీ జరుగుతుండగా, మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ దాడి చేసి షాకింగ్ నిజాలు బయటపెట్టింది.

– రూ.12 వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం.

దాడిలో అధికారులు రూ.12 వేల కోట్ల విలువైన ఎండీ, ఎమ్ఏ ముడి పదార్థాలు డ్రగ్స్, అలాగే 32 వేల లీటర్ల రా మెటీరియల్ పట్టుకున్నారు. ఈ స్థాయిలో మత్తు పదార్థాలు స్వాధీనం కావడం దేశంలోనే అరుదని చెబుతున్నారు.

– బంగ్లాదేశీ మహిళ లింక్ – అసలు నెట్‌వర్క్ బహిర్గతం.

ఒక బంగ్లాదేశీ మహిళ అరెస్టుతో మొదలైన ఈ కేసు, చివరికి భారీ అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్‌ను బయటపెట్టింది. తయారీదారులు – సరఫరాదారులు కలిసి హైద్రాబాద్ ను ప్రధాన కేంద్రంగా మార్చినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

– వాసు దేవి కెమికల్ ఫ్యాక్టరీ మాటున మత్తు వ్యాపారం.

బయటికి కెమికల్ ఫ్యాక్టరీగా కనిపించిన ఈ స్థావరం వాస్తవానికి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా కేంద్రంగా పనిచేసింది. ఆధునిక యంత్రాలతో, రసాయనాల ముసుగులో లక్షల కోట్ల వ్యాపారం సాగిందని సమాచారం.

– 13 మందిపై గట్టి వల.

ఇప్పటివరకు 13 మంది నిందితులు అరెస్టు అయ్యారు. వీరిలో డ్రగ్స్ తయారీదారులు, సరఫరాదారులు, కీలక మధ్యవర్తులు ఉన్నారు. ఇంకా పలువురు ముఖ్య నెట్‌వర్క్ సభ్యులు పోలీసుల రాడార్‌లో ఉన్నారని సమాచారం.

– దేశ వ్యాప్తంగా కలకలం

ఈ ఆపరేషన్ వివరాలు బయటపడటంతో అన్ని రాష్ట్రాల్లో కలకలం రేగింది. ఇప్పటికే కేంద్ర ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగాయి. అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో సంబంధాలపై స్పష్టత రావడానికి దర్యాప్తు వేగవంతం అవుతోంది. చర్లపల్లిలోని ఈ డ్రగ్స్ గుట్టురట్టు చర్య స్థానిక సమాజంలో శాంతి, భద్రత పెంచే దిశగా పెద్ద ముందడుగు అని పోలీసులు అభివర్ణించారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో మిగిలిన సహచరుల గుర్తింపు కోసం పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చర్లపల్లి లోని ఈ డ్రగ్స్ గుట్టురట్టు చర్య స్థానిక సమాజంలో శాంతి, భద్రత పెంచే దిశగా పెద్ద ముందడుగు అని పోలీసులు అభివర్ణించారు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో మిగిలిన సహచరుల గుర్తింపు కోసం పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Related posts