శంకర్ పల్లి లో మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్
శంకర్ పల్లి సెప్టెంబర్ 10(ప్రజాక్షేత్రం):నేటి నుండి ఈనెల 14వ తేదీ వరకు శంకర్ పల్లి మండలంలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు బుధవారం మిషన్ భగీరథ చేవెళ్ల సబ్ డివిజన్ ఈ ఈ చల్మారెడ్డి ప్రకటనలో తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని కామ దానం నుండి కడ్తాల్ మధ్యలో గేట్ వాల్స్, పైప్లైన్ల మరమ్మత్తుల పనులు జరుగుతున్నాయని అందువల్ల చేవెళ్ల సెగ్మెంట్ లోని షాబాద్ చేవెళ్ల మొయినాబాద్ శంకర్ పల్లి మండలాలు సరఫరా నేటి నుండి 14వ తేదీ వరకు ఉండదని తెలిపారు. ఈ విషయం ప్రతి గ్రామపంచాయతీ కార్యదర్శులకు తెలపడం జరిగిందని చెప్పారు. చేవెళ్ల, శంకర్ పల్లి, మొయినాబాద్ మునిసిపాలిటీల కమిషనర్ కు తెలియజేయడం జరిగిందని చెప్పారు. నాలుగు రోజులు ఆదివారం వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా లో అంతరాయం కలుగుతుందని అందుకు తాము చింతిస్తున్నామని తెలిపారు. అన్ని గ్రామాల ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
