అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అడ్మిషన్ గడువు పొడిగింపు..
చేవెళ్ల, సెప్టెంబర్ 11(ప్రజాక్షేత్రం):చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025-26 విద్యాసంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల గడువును పొడిగించిన్నట్లు స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డా. కె.సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో .బి.ఏ., బి.కాం., బి.ఎస్.సి. మొదటి సంవత్సరం అడ్మిషన్లు, ద్వితీయ, తృతీయ సంవత్సరం అడ్మిషన్ల కోసం చివరి తేదీని 12-09-2025 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు లేదా సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.📞 పూర్తి వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్: 9908640914.
