రేపు రావులపల్లి కలాన్ లో ఉచిత వైద్య శిబిరం
శంకర్‌పల్లి సెప్టెంబర్ 12(ప్రజాక్షేత్రం):భగవాన్ సత్యసాయి బాబా సేవా సంస్థలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమితి శంకర్‌పల్లి భజన మండలి ఆధ్వర్యంలో మండల పరిధిలోని రావులపల్లి కలాన్ గ్రామంలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని సత్యసాయి సేవా సంస్థలు శంకర్ పల్లి మండల చెందిన రవి తెలిపారు. నిష్ణాతులైన వైద్యులు వైద్య శిబి రముకు రానున్నారని ఇట్టి వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా మాత్రలు టానిక్ లు ఇవ్వడం జరుగుతుందని, ఆరోగ్యపరమైన సమస్యలు తీవ్రంగా ఉన్నట్లయితే సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా అవసరమున్న మేరకు ఉచిత శస్త్ర చికిత్సలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రావులపల్లి కలాన్ పరిసర గ్రామాలైన ఆలంఖాన్ గూడ, ముబారక్ పూర్ తదితర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో విరజిల్లాలని ఆయన కోరారు.
