పాక్ ను చిత్తు చేసిన భారత్
– 7 వికెట్ల తేడాతో టీమ్ఇండియా ఘన విజయం
– విఫలమైన పాక్ బ్యాటర్లు
– పాక్పై భారత్ గెలుపు
నేషనల్ బ్యూరో సెప్టెంబర్ 14(ప్రజాక్షేత్రం):దాయాది జట్టు పాక్‌పై భారత్ అదరగొట్టింది. ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుచేసింది. తొలుత భారత బౌలర్ల దెబ్బకు పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 127/9 పరుగులకే కట్టడి అయింది. కుల్‌దీప్ యాదవ్ (3/18), అక్షర్ పటేల్ (18/2), బుమ్రా (28/2) బంతితో అదరగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (47*; 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. తిలక్ వర్మ (31; 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో అలరించాడు. శుభ్‌మన్ గిల్ (10) తక్కువస్కోరుకే వెనుదిరిగాడు. శివమ్ దూబె (10*) నాటౌట్‌గా నిలిచాడు. టాస్ గెలిచి తొలుత పాక్ బ్యాటింగ్కు దిగింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ (40; 44 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షాహీన్ అఫ్రిది (33*; 16 బంతుల్లో 4 సిక్స్‌లు) చివర్లో మెరుపులు. ఫకార్ జమాన్ (17), ఫహీమ్ అష్రఫ్ (11), ముఖీమ్ (10) పరుగులు చేశారు. భారత బౌలర్ల ధాటికి సైమ్ అయుబ్, మహ్మద్ నవాజ్ డకౌట్ అయ్యాడు. హసన్ నవాజ్ (5), మహ్మద్ హారిస్ (3), సల్మాన్ అఘా (3) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.
– ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన కుల్‌దీప్ యాదవ్
నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న కుల్‌దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అక్షర్ పటేల్‌కు వచ్చింది. దీంతో గ్రూప్ ఏలో వరుసగా రెండో విజయం అందుకుంది. తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 19న జరగననుంది. టీమ్ఇండియా ఒమన్తో తలపడనుంది.
– సంబరాల్లో భారతీయులు
పాకిస్థాన్పై టీమ్ఇండియా గెలవడంతో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. రోడ్లపైకి వచ్చి జాతీయ జెండాలను పట్టుకుని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
