ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్
– ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్
నేషనల్ బ్యూరో సెప్టెంబర్ 16(ప్రజాక్షేత్రం):ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 75వ పుట్టినరోజు సందర్భంగా తన మిత్రుడు ట్రంప్ ఫోన్ చేశారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ట్రంప్ లాగే తానూ భారత్-అమెరికా సమగ్ర భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా వివాద పరిష్కారం కోసం ట్రంప్ చొరవకు మద్దతు ఇస్తున్నట్లు మోదీ తెలిపారు.
