Praja Kshetram
తెలంగాణ

ఇచ్చిన మాట ప్రకారం పెంచన్లను పెంచాల్సిందే

ఇచ్చిన మాట ప్రకారం పెంచన్లను పెంచాల్సిందే

 

– ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మాసాయిపేట యాదగిరి మాదిగ

శంకర్ పల్లి సెప్టెంబర్ 20(ప్రజాక్షేత్రం):ఎన్నికల సమయంలో పెంచు ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే పెంచన్లను పెంచాలని లేనిపక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. ఎమ్మార్పీఎస్ శంకర్ పల్లి మండల అధ్యక్షులు బండ్లగూడ శ్రీనివాస్ మాదిగ మాదిగ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మాసాయిపేట యాదగిరి మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ మాదిగ, పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ పంచాయతీల ముట్టడి సందర్భంగా శంకర్ పల్లి మండలం మోకిల, దొంతాన్ పల్లి గ్రామంలో పంచాయతీ జన్వాడ వార్డు కార్యాలయల వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ అధికారికి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్దులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు మరియు చేయూత పించను దారులకు పెంచన్లను పెంచుతామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు మరియు చేయూత పించను దారులకు నాలుగు వేలకు, వికలాంగులకు ఆరువేల రూపాయలకు పెంచాల్సిందేనన్నారు. ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో తన మాట నిలబెట్టుకోవాలన్నారు.

Related posts