కేఏ పాల్‌పై లైంగిక ఆరోపణలు..
– పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు..
హైదరాబాద్ సెప్టెంబర్ 21(ప్రజాక్షేత్రం):ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. పాల్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక యువతి.. తనను లైంగికంగా వేధిస్తున్నారని షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలను షీ టీమ్స్‌కు అందచేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ నేపథ్యంలో షీ టీమ్ కేసును పంజాగుట్ట పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
