సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన భీమ్ భరత్
మొయినాబాద్ సెప్టెంబర్ 25(ప్రజాక్షేత్రం):తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (సిఎంఆర్ఎఫ్) సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను లబ్ధి దారులకి చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయం పేదల వరం అని తెలిపారు. మరియు వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ మొయినాబాద్ మండలం అధ్యక్షులు మాణయ్య, వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, వైస్ చైర్మన్ కృషరెడ్డి, షాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింలు, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరెడ్డి, తోల్కట్ట సత్య నారాయణ, గన్నెపాగ నర్సింగ్ రావు, శంకర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నజీరుద్దీన్, బద్దం కృష్ణారెడ్డి, అంతప్ప గూడ పెంటయ్య, ఇంద్రారెడ్డి ప్రశాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
