Praja Kshetram
తెలంగాణ

జర్నలిస్టుల సమస్యలు ముఖ్యమంత్రితో చర్చిస్తా:మంత్రి శ్రీధర్ బాబు

జర్నలిస్టుల సమస్యలు ముఖ్యమంత్రితో చర్చిస్తా

 

– రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు..

– ప్లాట్ల మంజూరుకు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నాము..

– ఆరోగ్య కార్డులు, గుర్తింపు కార్డులపై త్వరలోనే నిర్ణయం.

– రంగారెడ్డి జిల్లా టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా మూడవ మహాసభల్లో మంత్రి ప్రకటన

– పెన్నుపోటుతోనే జిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చారు

– జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించండి

– ఎమ్మెల్సీ నవీన్ కుమార్ సూచన

– మంత్రి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిల మధ్య చురుకలు.. చమక్కులు.

– ఆసక్తికరంగా రంగారెడ్డి జిల్లా టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా 3వ మహాసభలు

– జర్నలిస్టులకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

– సభకు హాజరైన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్

– రంగారెడ్డి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున హాజరైన జర్నలిస్టులు

– టిడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా శేరీబాయి గణేష్

– జిల్లా ప్రధాన కార్యదర్శిగా సైదులు

కందూకూర్ సెప్టెంబర్ 26(ప్రజాక్షేత్రం):జర్నలిస్టుల సమస్యపై ముఖ్యమంత్రితోనూ, మంత్రి శ్రీనివాసరెడ్డి తోనూ చర్చిస్తాను.. సమస్యల విషయంలో వాళ్ళు కూడా సీరియస్ గా ఉన్నారు.. త్వరలోనే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది.. అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) మహాసభలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతకుముందు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్, సిపిఎం నాయకులు పగడాల యాదయ్య తదితరులు హాజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవాలని సభలో కాంగ్రెస్ బిఆర్ఎస్, సిపిఎం తదితర పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా జిల్లా టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సోమయ్య, బసవ పున్నయ్య, జిల్లా కార్యదర్శి సైదులు, జిల్లా సీనియర్ జర్నలిస్టు రఘుపతి తదితరులు మంత్రి దృష్టికి తీసుకువస్తూ.. జర్నలిస్టులకు సంబంధించి ప్లాట్ల సమస్యలు, ఆరోగ్యకార్డులు, గుర్తింపు కార్డుల విషయంలో వెంటనే స్పందించాలన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల దాడిపై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ జర్నలిస్టుల ఫ్లాట్ల వ్యవహారాలు సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఆగిపోయాయని, వీటికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని వెల్లడించారు. భూభారతి ద్వారా అవకాశం ఉంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. సోషల్ మీడియా విచ్చలవిడిగా రాజ్యమేలుతున్న తరుణంలో జర్నలిస్టులు విలువలు పాటించాలని, తమకు తామే బౌండరీలు నిర్వహించుకోవాలని సూచించారు. జర్నలిస్టుల సమస్యల విషయంలో ముఖ్యమంత్రిని ఐదుసార్లు కలిసామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రభుత్వం హెల్త్ కార్డుల విషయంలో సీరియస్ గా ఉందని, త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే హై పవర్ సెంటర్ ను ఏర్పాటు చేసినందుకు కూడా ఆలోచన చేస్తున్నామని, త్వరలో జర్నలిస్టులకు పురస్కారాలు కూడా అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో కలంబలం గొప్పదని మంత్రి ఉద్ఘాటించారు. జర్నలిస్టుల సమస్యలు తనకు అన్నీ తెలుసుకొని కాకపోతే అమలయి హామీలను మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని, వృధా హామీలను ఇవ్వబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జర్నలిస్టులకు చేసింది ఏమీ లేదని అందుకే వెన్నుపోటుతో ఆ ప్రభుత్వాన్ని జర్నలిస్టులే దించేశారని మంత్రి శ్రీధర్ బాబు చమత్కరించారు.

-చురుక్కులు.. చమక్కులు..

– మంత్రి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మధ్య సరదా సంభాషణలు..

రంగారెడ్డి జిల్లా మహాసభలో భాగంగా ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డిల మధ్య సంభాషణలు చురుకలతో, చమక్కులతో సాగాయి.. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ మాట్లాడుతూ నవీన్ రెడ్డి తమ పార్టీలోనే ఉండేవాడని.. తమ భవిష్యత్తులో తమ పార్టీలోకి వస్తాడేమో.. అంటూ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రతిపక్షంలోనే ఉంటే అధికార పక్షంతో బలంగా పోరాటం సాగించవచ్చని సమాధానం చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు అనుకుంటే తప్పకుండా చేస్తారని, జర్నలిస్టులకు న్యాయం చేయాలని సూచించారు. అనంతరం శ్రీధర్ బాబు తన ప్రసంగంలో స్పందిస్తూ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రతిపక్ష నేత అని చెప్పి తప్పించుకున్నాడని, అందరూ జర్నలిస్టుల భారాన్ని తనపైనే వేశారని చమత్కరించారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించే సమయంలో జర్నలిస్టులకు ఫ్లాట్లు ఎలా ఇవ్వాలో ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని చెప్పగా, ఎమ్మెల్సీ కల్పించుకొని జర్నలిస్టులు కూడా ఉద్యమకారులే కదా.. వారికి ఉద్యమకారుల కోటాలో ప్లాట్లు ఇవ్వవచ్చు కదా అని సూచించారు. దీనికి మంత్రి స్పందిస్తూ ఈ నిర్ణయం మీరు 2014లోనే తీసుకుంటే బాగుండేది కదా..? అని చమత్కరించారు. ఇలా ఇద్దరి మధ్య చమత్కారంతో కూడిన మాటలతో సభలో నవ్వులు నిండాయి. మంత్రి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఇరువురు తమ ప్రసంగాల మధ్య ఒకరినొకరు చురకలు వేసుకుంటూ సరదాగా దేప్పిపొడుచుకున్నారు.

– జర్నలిస్టులకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

సమస్యలు పరిష్కరించే విషయంలో జర్నలిస్టులకు ప్రభుత్వ మద్దతు కచ్చితంగా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కందుకూరులో జరిగిన మహాసభలో భాగంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్న సమస్యలను తీర్చేందుకు జర్నలిస్టులు చాలా కష్టపడతారని, వారి కష్టాలను తెలుసుకొని తీర్చాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు పనిచేసే తత్వం ఉన్న వ్యక్తి అని, ఆయన గురించి ఢిల్లీలో జైరాం రమేష్ చాలా అద్భుతంగా చెప్పారని అన్నారు. నా నియోజకవర్గ పాత్రికేయ మిత్రులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చదువులు విలువైనదిగా మారుతున్న సమయంలో విద్యా రంగంలో పాత్రికేయ పిల్లలకు చదువులు చెప్పే విషయంలో కూడా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ ఇన్సూరెన్స్ తన సొంత డబ్బులతో చేయించినట్లు వెల్లడించారు. జర్నలిస్టుల సమస్యల మంత్రి దృష్టికి తేవాలన్న ఉద్దేశంతోనే ఆయన వెన్నంటి ఉండి ఈ కార్యక్రమానికి తీసుకువచ్చానని స్పష్టం చేశారు. జర్నలిస్టులు పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం ప్రటిష్టంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గంలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాదారుల కోరల్లో ఉందని, దానిని సేకరించి జర్నలిస్టులకు ఇవ్వాలని మంత్రిని కోరారు. మంత్రి మరోసారి రాష్ట్ర నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వెల్లడించారు.

– జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా షెరిబాయి గణేష్, సైదులు

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా గణేష్, సైదులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మిగతా పదవులకు పోటీ ఏర్పడింది. పూట పోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో సహాయ కార్యదర్శి ఉపాధ్యక్షులు తదితర పదవులకు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరిగింది. జిల్లా సలహాదారుగా షాద్ నగర్ సీనియర్ జర్నలిస్టు లట్టుపల్లి మోహన్ రెడ్డి ఎంపికవగా, జిల్లా ఉపాధ్యక్షులుగా భవాని వేణుగోపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా వహీద్, సహాయ కార్యదర్శిగా మన్సూర్ అలీ ఖాన్ ఎంపికయ్యారు. ఈ సభలో షాద్ నగర్ సీనియర్ జర్నలిస్టు కెపి ఆలపించిన గీతానికి మంత్రి ముక్తుడయ్యారు. తన ప్రసంగంలో కేపీని ప్రత్యేకంగా అభినందించారు.

Related posts