Praja Kshetram
తెలంగాణ

నీటి మునిగిన పంట పొలాలు ఆదుకోవాలని అన్నదాతలు ఆవేదన

నీటి మునిగిన పంట పొలాలు ఆదుకోవాలని అన్నదాతలు ఆవేదన

 

వలిగొండ సెప్టెంబర్ 27(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి వలిగొండ మండలం భారీ వర్షాలకి మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో మూసి పరివాహక ప్రాంతం లోని పంట పొలాలు నీటి మునిగాయి. వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామానికి చెందిన రైతుల పొలాలు మూసి ప్రవాహంలో మునిగాయి. పంట చేదికందే పరిస్థితి లేదని రైతులు వాపోయారు. పోలబోయిన గోపాల్ కు చెందిన మూడు ఎకరాలు, పోల బోయిన నర్సయ్య కు చెందిన మూడు ఎకరాలు, పొల బోయిన యాదయ్యకు చెందిన మూడు ఎకరాలు , మొత్తం తొమ్మిది ఎకరాల వరిపంట పూర్తిగా నీట మునిగిందని, పంట నష్టపోయిన తమను ప్రభుత్వము ఆదుకోవాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts