Praja Kshetram
తెలంగాణ

బాత్రూంలో వంటగది ఇల్లు లేక వృద్ధురాలి అవస్థలు

బాత్రూంలో వంటగది ఇల్లు లేక వృద్ధురాలి అవస్థలు

 

వలిగొండ అక్టోబర్ 01(ప్రజాక్షేత్రం):వలిగొండ మండలం పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో సంగీ శెట్టి.చిన్ననరసమ్మ .రామచంద్రయ్య .ఇల్లు లేక బాత్రూం లో వంట చేసుకుంటూ నానా అవస్థలు పడుతున్నది. ఒక చిన్న రూము అది పెంకటేళ్లు. కోతుల బెడద వర్షం వస్తే అంత కురుసుడే .ఎప్పుడు కుల్తదో అనే భయం ఏమి చేయలేక దిక్కు దోచక వేడుకుంటుంది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి. ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నా రాలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇల్లు రావడం లేదు. చుట్టుపక్కల చెట్లు పారు గోడ కూడా లేదు. రాత్రిపూట ఎక్కడ పాములు తేళ్లు వస్తాయని భయము. చిన్న గుడిసె అందులో వంట చేసేది అది అది కూడా కూలిపోయింది. 10 సంవత్సరాలుగా ఇదే బాత్రూంలో వంట చేస్తున్నది. అధికారులకు మనసు రావడం లేదు. ప్రజాప్రతినిధులు దృష్టి సారించి ఇందిరమ్మ పథకం కింద ఆర్ధిక సహాయం అందించాలని కోరుతున్నది. కనీసం గుంట భూమి కూడా లేదు. ఇటీవల ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా కానీ రాలేదు. అధికారులు నిర్లక్ష్యం వలన ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటుంది.

Related posts