Praja Kshetram
తెలంగాణ

ఎన్నికలపై ఏం చేద్దాం? – హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ

ఎన్నికలపై ఏం చేద్దాం? – హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ

 

– హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చలు

– ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన హైకోర్టు

హైదరాబాద్ అక్టోబర్ 11(ప్రజాక్షేత్రం):స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చలు జరుపుతోంది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేదని హైకోర్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. జీవో 9, 41పై మాత్రమే మధ్యంతర స్టే ఇచ్చినట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు న్యాయ నిపుణుల సూచన మేరకు తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది.

 

Related posts