Praja Kshetram
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు – ఎస్సై బోరగాల అశోక్

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

 

-ఎస్సై బోరగాల అశోక్

మొగుళ్లపల్లి అక్టోబర్ 14(ప్రజాక్షేత్రం):జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అక్రమ ఇసుక దందాపై ఎస్సై బోరగాల అశోక్ కన్నెర్ర చేశారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక దందాను కొనసాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా. హెచ్చరించారు. మండలంలోని పోతుగల్లు వాగు నుండి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత ట్రాక్టర్ డ్రైవర్ల పై, యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Related posts