హైదరాబాద్ శివారులో మరోసారి రేవ్ పార్టీ కలకలం..
-ఓ రిసార్ట్స్‌లో ఎస్ఓటీ దాడులు
హైదరాబాద్ అక్టోబర్ 14(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ శివారులో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. మహేశ్వరంలోని ఓ రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలిసింది. రాచకొండ పరిధిలోని చంద్రారెడ్డి రిసార్ట్స్‌పై తాజాగా ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి.. రిసార్ట్స్‌లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తించారు. అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ పార్టీని ఏపీలోని గుంటూరుకు చెందిన ఫర్టిలైజర్ (సీడ్) కంపెనీ డీలర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన కంపెనీకి చెందిన వివిధ డీలర్లకు, వ్యాపార భాగస్వాములను కలిపి ఈ రేవ్ పార్టీని నిర్వహించినట్లు తెలిసింది. రాత్రంతా సాగిన ఈ పార్టీలో ఏడుగురు మహిళా డాన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని పోలీసులు సమాచారం. ఈ మహిళలు హైదరాబాద్, బెంగళూరుకు చెందినవారని సమాచారం. పార్టీలో 14 మంది మహిళలతో సహా మొత్తం 50 మంది వరకు ఉన్నట్లు సమాచారం. దాడుల సందర్భంగా పోలీసులు పెద్ద మొత్తంలో మద్యం సీసాలుస్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
