నిరాడంబర జీవనానికి ఆయన నిదర్శనం…
– నిరాడంబర జీవనానికి నిదర్శనం..
– కంటి పరీక్షల కోసం క్యూ లైన్‌లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య..
పాల్వంచ అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం): ప్రస్తుతం పదవులు.. గొప్ప పేరు.. పలుకుబడిని సమాజంలో కోరుకునే వారు చాలామంది ఉంటారు. అయితే ఎంత ఎత్తుకు ఎదిగిన.. కానీ ఒదిగి ఉండాలి. ఉన్నత శిఖరాలు అధిరోహించిన… అణిగిమణిగి ఉండాలి… అని తానే ఒక నిదర్శనంగా నిలిచి చూపిస్తున్నారు మన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య. శాసనసభ్యుడిగా ఐదు సార్లు గెలిచినా, పరిపాలన చేసిన కానీ ఎలాంటి గర్వం లేకుండా సామాన్యులతో సమానంగా… ప్రతి చోట ఉండి తానేంటో అందరికీ చూపిస్తున్నారు. నాయకుడు అంటే ప్రజలను శాసించేవాడు కాదని… ప్రజలతో ఉండేవాడని తన ప్రవర్తన… నడవడిక ద్వారా నిరూపిస్తున్నారు… అలాంటి సంఘటనే బుధవారం చోటుచేసుకుంది.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గడుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు. సైకిల్ పై వెళ్లడం, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వ సాధారణంగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షల కోసం బుధవారం ఆయన వచ్చారు. అక్కడ అందరితో పాటే ఓపీ చీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక కంటి పరీక్ష చేయించుకున్నారు. వార్డు మెంబర్, ఎంపీటీసీలే హంగూ ఆర్భాటాలతో జీవిస్తుండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని పలువురు అభినందించారు.
