బి.ఆర్ గవాయిపై దాడి చేసినా నిందితున్ని వెంటనే శిక్షించాలి.
-అడ్వకేట్ కలివేముల సుమిత్ర
సంగారెడ్డి జిల్లా అక్టోబర్ 16(ప్రజాక్షేత్రం):సెప్టెంబర్ 15వ తేదీన రాకేష్ కిషోర్ అనే అడ్వకేట్ వేసిన పిటిషన్ పై విచారణ జరుగుతున్న సందర్భంలో వారు వేసిన పిటిషన్ మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయంలోని ఒక విగ్రహం యొక్క తలలేదు అది విష్ణుమూర్తిగా భావిస్తూ తల అతికించమని కోరగా అది మా పరిధిలో లేదని అది పురావస్తు శాఖకు సంబంధించినది దీనిని మేము విచారించలేము అని చెప్పినప్పటికీ పదేపదే విసిగిస్తున్న సందర్భంలో మీరు భక్తుడే కదా మీ విష్ణుమూర్తిని ప్రార్థించండి అని అనడం జరిగింది. దీనికి మతోన్మాదులు మతం రంగు పోస్తూ విష్ణుమూర్తిని సనాతన ధర్మాన్ని అవమానించాడు అతడి కారును అడ్డుకోండి దాడులు చేయండి. ముఖం మీద ఉమ్మేయండి అంటూ ట్విట్టర్ చేశారు ఇది ముమ్మాటికి రెచ్చగొట్టే చర్య. రాకేష్ కిషోర్ అనే న్యాయవాది గతంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పిటిషన్ వేసినప్పటికీ 1958 ప్రాచీన స్థలాలు ప్రాంతాల చట్టం కింద విగ్రహాలను పునర్ నిర్మించడం కుదరదు అని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనేది ముమ్మాటికి కోర్టును తప్పు త్రోవ పట్టించడమే ఇది నూటికి నూరు శాతం తప్పు ఇదే విషయం బయట రాద్దాంతం చేస్తున్న సందర్భంలో వెంటనే గవాయి మీ మనోభావాలు దెబ్బతింటే నేను క్షమాపణ కోరుతున్నాను అని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ నిండు సభలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బి.ఆర్ గవాయి పైన బూట్లతో దాడి చేయడం చాలా నేరం. ఇది పూర్తిగా రాజ్యాంగం పైన పార్లమెంటరీ వ్యవస్థ పైన, ప్రజాస్వామ్యం పైన దాడిగానే భావిస్తూ ….అతడిని వెంటనే విచారించి శిక్షను విధించాలి. లేకుంటే భారత రాజ్యాంగం, ఏకీకృత న్యాయవ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. భారత ప్రభుత్వం వెంటనే అతడిపై FIR చేసి, అరెస్టు చేసి వెంటనే శిక్షించాలి లేదంటే దేశవ్యాప్త ఉద్యమం మొదలైతుంది. ఒక అడ్వకేట్ గా న్యాయస్థానంలో భాగస్వామిగా ఉన్నటువంటి నేను వ్యక్తిగతంగా, చట్టపరంగా దీనిని పూర్తిగా ఖండిస్తున్నాను. భారతదేశం అనేది “సెక్యులర్ కంట్రీ “అని భారత రాజ్యాంగ ప్రవేశికలో రాసుకున్నాము. ఇక్కడ ఒక మతం వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేయడం అనేది “తీవ్రవాదుల కంటే” భయంకరమైన చర్య. బాధితుడు కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా ఈ దాడిని సమర్థించుకోవడం సిగ్గుమాలిన చర్య స్వయంగా అంబేద్కర్ ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం కలిగిన దళిత , బహుజన సామాజిక వర్గం నుండి వచ్చిన బిఆర్ గవాయి భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం జీర్ణించుకోలేక ..మనువాది రూపంలో ఉన్న రాకేష్ కిషోర్ దాడి చేయడం అనేది యావత్ అంబేద్కర్ వాదులు అందరం, మానవతావాదులం అందరం సమసమాజాన్ని కోరుకునే వారందరం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. దళితులు విద్యకు, ఉద్యోగాలకు, సమాజానికి దూరంగా ఉండాలి అని కోరుకునే మనువాదులు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడంలో …దళితులు చదువుకుంటే అత్యున్నత హోదాలో ఉంటే ఓరవలేక తట్టుకోలేక ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఇది నిజంగా సంఘ వ్యతిరేక చర్యగా భావిస్తూ… రాకేష్ కిషోర్ ను వెంటనే శిక్షించాలి అని ఒక అడ్వకేట్ గా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. లేదంటే మా యొక్క కార్యాచరణ రూపొందించుకోవాల్సి వస్తుంది తస్మాన్ జాగ్రత్త అని కలివేముల సుమిత్ర అడ్వకేట్ సంగారెడ్డి కోర్ట్ ఆమె అన్నారు.
