Praja Kshetram
తెలంగాణ

బస్తీ దవాఖాన పరిశీలనలో లోపాలు బహిర్గతం — చర్యలకు ఆదేశించిన ఎమ్మెల్యే

బస్తీ దవాఖాన పరిశీలనలో లోపాలు బహిర్గతం — చర్యలకు ఆదేశించిన ఎమ్మెల్యే

 

కాప్రా అక్టోబర్ 21(ప్రజాక్షేత్రం):బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మీర్పేట్ హెచ్‌.బి. కాలనీ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ దవాఖానను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. దవాఖానలో అందిస్తున్న వైద్యసేవలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గత ఆరు నెలలుగా డాక్టర్ల వేతనాలు అందడం లేదని సిబ్బంది తెలిపారు. అనంతరం ఫార్మసీని పరిశీలించిన ఎమ్మెల్యే ఎక్స్పైరీ టాబ్లెట్లు, ఒక బాక్స్‌లో వేరే టాబ్లెట్ ప్యాక్ ఉన్నట్లు గుర్తించి సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం లో డివిజన్ మాజీ అధ్యక్షులు కరిపే ప్రవీణ్ వంజరి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts