దశాబ్దాల కల సాకారం.. ప్రపంచ కప్ విజేతగా టీమిండియా..!
హైదరాబాద్ నవంబర్ 02(ప్రజాక్షేత్రం):భారత జట్టు చిరకాల స్వప్నం సాకారమైంది. దశాబ్దాలుగా ఊరిస్తున్న వన్డే ప్రపంచ కప్‌ను ఒడిసిపట్టేసింది. రెండుసార్లు ఫైనల్లో ఎదురైన పరాభవాన్ని దిగమింగిన భారత జట్టు మూడో ప్రయత్నంలో జగజ్జేతగా అవతరించింది. దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేసి.. వన్డే వరల్డ్ కప్‌లో కొత్త ఛాంపియన్‌గా ఆవిర్భవించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఆనందానికి అవధుల్లేవు. భారత మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వన్డే వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. 2005, 2017లో మిథాలీ రాజ్ బృందం చేజారిన ప్రపంచకప్‌ను సొంతగడ్డపై పట్టేసింది హర్మన్‌ప్రీత్ కౌర్. డీవై పాటిల్ మైదానంలో ఓపెనర్ షఫాలీ వర్మ(87 : 2-36), దీప్తి శర్మ(58 : 5-39)లు ఆల్‌రౌండ్ షోతో భారత్ మొట్టమొదటిసారి ఛాంపియన్‌గా అవతరించగా.. తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా కప్ కల చెదిరింది. భారీ ఛేదనలో రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు కెప్టెన్ లారా వొల్వార్డ్త్(65 నాటౌట్), సునే లుస్(). వీర్దిదరి జోడీని విడదీసేందుకు హర్మన్‌ప్రీత్ పార్ట్‌టైమ్ బౌలర్ షఫాలీకి బంతిని అందించింది. ఆమె.. రెండో బంతికే లుస్‌ను రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసింది. ఆ తర్వాతి ఓవర్లోనే డేంజరస్ మరిజానే కాప్(4 )ను సైతం ఔట్ చేసింది తను. లెగ్ సైడ్ పడిన బంతిని మరిజానే లెగ్ సైడ్ ఆడాలనుకుంది. కానీ, వికెట్ కీపర్ రీచా సూపర్ క్యాచ్ అందుకోవడంతో సఫారీల నాలుగో వికెట్ పడింది. జఫ్తాను ఔట్ చేసిన దీప్తి ఐదో వికెట్ అందించింది. అయతే.. రాధా యదవ్ వేసిన ఓవర్లో నో బాల్‌కు డెర్క్‌సెన్ () రెండు సిక్సర్లు బాదగా.. 13 రన్స్ వచ్చాయి.
అర్థ శతకాలతో మెరిసిన షఫాలీ, దీప్తి
తొలి ప్రపంచకప్ వేటలో ఉన్న భారత్ ఫైనల్లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ(87), దీప్తి శర్మ(58)లు అర్ధ శతకాలతో కదం తొక్కగా ఫైనల్ చరిత్రలోనే రికార్డు పరుగులు చేసింది టీమిండియా. ఓపెనర్లు సెంచరీ భాగస్వా్మ్యంతో శుభారంభం ఇచ్చినా మిడిలార్డర్ వైఫల్యంతో 300 మార్క్ అందుకోలేకపోయింది. చివరి పది ఓవర్లో 69 రన్స్ మాత్రమే రావడంతో హర్మన్‌ప్రీత్ సేన 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేయగలిగింది.
