చేవెళ్ల మీర్జాగూడ బస్సు రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం
– మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
– క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి
– 21 మంది ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరం
– వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా
– ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ
చేవెళ్ల నవంబర్ 03(ప్రజాక్షేత్రం):చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద రోడ్డు బస్సు రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో 21మంది ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధాకరమని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ పేర్కొన్నారు. బస్సు ప్రయాణికులపై టిప్పర్ లో ఉన్న కంకర పడిపోవడంతో 21మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన తీవ్ర విషాద ఘటన కలిచివేసిందని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
