డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు?
హైదరాబాద్ నవంబర్ 09(ప్రజాక్షేత్రం):పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు,శనివారం సాయంత్రం వెల్లడించారు. ఈ తేదీలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ ద్వారా ప్రకటిస్తూ, ప్రజాస్వా మ్యాన్ని బలోపేతం చేసేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా ఫలప్రదమైన, అర్థవంతమైన చర్చలు జరగాలని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగు తున్న అత్యంత క్లుప్తమైన శీతాకాల సమావేశాల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. గతేడాది శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారంభమై డిసెంబర్ 20న ముగిశాయి. 26 రోజుల వ్యవధిలో లోక్సభ 20 సార్లు, రాజ్యసభ 19 సార్లు సమావేశమయ్యా యి. ఆ సెషన్లో లోక్సభ ఉత్పాదకత 54.5 శాతం గా, రాజ్యసభ ఉత్పాదకత 40 శాతంగా నమోదైంది. అప్పుడు ఐదు బిల్లులను ప్రవేశపెట్టగా, ‘భారతీయ వాయుయాన్ విధేయక్ 2024’ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి
