ఎర్రకోట దగ్గర భారీ పేలుడు..
న్యూఢిల్లీ, నవంబర్ 10(ప్రజాక్షేత్రం):ఎర్రకోట దగ్గర భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఐదు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది. మరోవైపు పేలుడు కారణంగా పరిసరాల్లో ఉన్న కార్లకు మంటలు అంటుకోగా.. సమీపంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్, ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ఘటనా స్థలికి చేరుకుంది. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
