దమ్మాయిగూడలో అనుమానాస్పదంగా మహిళ మృతి.
దమ్మాయిగూడ నవంబర్ 13(ప్రజాక్షేత్రం):కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. దమ్మాయిగూడ మున్సిపాలిటీ రామలింగేశ్వర కాలనీకి చెందిన తలారి స్వప్న (45) అనుమానాస్పదంగా మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం — స్వప్న భర్త శ్రీను, కుమారుడితో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గురువారం స్వప్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు
