Praja Kshetram
తెలంగాణ

32 కార్లతో పలు ప్రాంతాలలో విధ్వంసం ? 

32 కార్లతో పలు ప్రాంతాలలో విధ్వంసం ?

 

నేషనల్ బ్యూరో నవంబర్ 13(ప్రజాక్షేత్రం):దేశవ్యాప్తంగా పలు నగరాలు, సునిశిత పట్టణాలు, ప్రాంతాలలో భారీ స్థాయిలో ఉగ్రవాద ఆత్మాహుతి దాడులకు కుట్ర జరిగింది. ఎర్రకోట వద్ద కారులో భారీ స్థాయి పేలుడు, 13 మంది దుర్మరణం తరువాతి దర్యాప్తు క్రమంలో ఇంటలిజెన్స్ అధికారులు ఈ కీలక సమాచారం రాబట్టారు. మొత్తం 32 కార్లు , ఇతరత్రా వాహనాలలో భారీ పేలుడు పదార్థాలను తీసుకువెళ్లి , జనసమ్మర్థపు ప్రాంతాలలో అదును చూసుకుని పేల్చివేసేందుకు, తద్వారా కల్లోలం సృస్టించేందుకు పాక్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ ఆయా ప్రాంతాల్లోని తమ ఏజెంట్ల సహకారంతో పూర్తి సమన్వయంతో కుట్రకు దిగినట్లు ఇప్పుడు దర్యాప్తు వేగవంతం క్రమంలో స్పష్టం అయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతి కారులోనూ శక్తివంతమైన పేలుడు పదార్థాలను గుట్టుచప్పుడు కాకుండా తీసుకువెళ్లేందుకు తగు విధమైన ఏర్పాట్లు జరిగినట్లు పసికట్టారు. ఇందుకు ఉగ్రశక్తులు హ్యుండాయ్ ఐ20 , ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వంటి ఆధునీకరించిన కార్లను వాడాలని వ్యూహరచనకు దిగారు. దేశంలో పలు చోట్ల వరుస పేలుళ్లకు ఇప్పటికే ఈ కార్లు సిద్ధం అయ్యాయా? ఉంటే అవి ఎక్కడున్నాయనేది ఇప్పుడు ఇంటలిజెన్స్ వర్గాల దర్యాప్తు క్రమంలో కీలక అంశం అయింది.

Related posts