Praja Kshetram
తెలంగాణ

జూబ్లీహిల్స్ కు ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్.

జూబ్లీహిల్స్ కు ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్.

– సీఎం రేవంత్ పోరాట పటిమకు తలకిందులైన బిఆర్ఎస్, బిజెపి.

– జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయదుందుభి.

– మొత్తం 10 రౌండ్లలోను ఆదిక్యం సాధించిన నవీన్ యాదవ్.

– పోరాడి ఓడిన బిఆర్ఎస్.

– డిపాజిట్ కోల్పోయిన బిజెపి.

వనపర్తి ప్రతినిధి, నవంబర్ 14(ప్రజాక్షేత్రం):జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నూతన ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ అఖండ మెజారిటీతో ఎన్నికయ్యారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ భారీ ఆదిక్యత సాధించారు.సీఎం రేవంత్ రెడ్డి పోరాట పటిమకు బిఆర్ఎస్, బిజెపి పార్టీల అభ్యర్థుల భవితవ్యం తలకిందులైంది. ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాటుచేసిన మొత్తం 10 రౌండ్లలోను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొదటి నుంచి ఆదిక్యత చాటుతూ 24,729 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఆయనకు 98,988 ఓట్లు పోల్ కాగా బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డికి 17, 061 ఓట్లు వచ్చాయి. అత్యల్ప ఓట్లు సాధించిన బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు.

-కేటీఆర్ కు భారీ షాక్

జూబ్లీహిల్స్ బై పోల్ ఎన్నికలో బిఆర్ఎస్ తరఫున పోటీలో నిలిచి ఓడిపోయిన మాగంటి సునీతకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే! అభ్యర్థి ఎంపిక నుంచి పార్టీ ప్రచారం వరకు అంతా తానై వ్యవహరించిన గులాబీ పార్టీ యువరాజుకు హైదరాబాద్ మహానగర ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. గ్రేటర్ కు సంబంధించి
ఇదివరకే కంటోన్మెంట్ ఉపఎన్నికలో పరాభవం ఎదుర్కొన్న బిఆర్ఎస్ కు తాజాగా జూబ్లీహిల్స్ లోను చావు దెబ్బ తప్పలేదు. కేటీఆర్ రోడ్ సోలు, కార్నర్ మీటింగులు, సామాజిక ఆత్మీయ సమ్మేళనాలు, జనం స్పందన బ్రహ్మండంగా కనిపించినా అవేమీ ఓట్లుగా బదలాయింపు కాలేదని నవీన్ యాదవ్ విజయాన్ని బట్టి తెలుస్తోంది. కేటీఆర్ షోలకు వచ్చిన వారిని చూసి బిఆర్ఎస్ దే విజయం అని అందరూ భ్రమపడ్డారు. రౌడీ అభ్యర్థి అని దుష్ప్రచారం చేసినా, బుల్డోజర్ సర్కారు రెండేళ్ల పాలనపై రెఫరండం అని మొరపెట్టుకున్నా బిఆర్ఎస్ కు ఓట్లు పడలేదు.చివరకు ఆడబిడ్డను గెలిపించాలన్న సెంటిమెంటు కూడా పనిచేయలేదు.

Related posts