చేవెళ్ల మున్సిపాలిటీలో కుక్కల బెడద తీర్చండి
– చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని ఇచ్చిన చేవెళ్ల బీజేపీ నాయకులు
– కుక్కల దాడిలో ఎవరికి ఎలాంటి హనీ జరిగినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత
– చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షులు అత్తెల్లి అనంత్ రెడ్డి బీజేపీ నాయకులు వైభవ్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 14(ప్రజాక్షేత్రం):చేవెళ్ల మున్సిపాలిటీలో కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షులు అత్తెల్లి అనంత్ రెడ్డి బీజేపీ నాయకులు వైభవ్ రెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షులు అత్తెల్లి అనంత్ రెడ్డి బీజేపీ నాయకులు వైభవ్ రెడ్డిలు మాట్లాడుతూ చేవెళ్ల మున్సిపల్ పరిధిలో కుక్కల బెడదతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కుక్కల దాడిలో ఎవరికి ఎలాంటి హనీ జరిగినా ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పారు. చేవెళ్ల మున్సిపాలిటీలో కుక్కల సమస్య పెరుగుతున్నందున, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈవిషయంలో మున్సిపల్ అధికారులు సానుకూలంగా స్పందించి, వెంటనే అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కుంచం శ్రీనివాస్, నాయకులు అశోక్ శ్రీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి అభిశేఖర్ రెడ్డి, పాగా వెంకటేష్, మధుకర్, గణేష్ చాకలి శ్రీనివాస్, మిట్టు శివ లు పాల్గొన్నారు.
