Praja Kshetram
క్రైమ్ న్యూస్

విద్యార్థులు స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన వార్డెన్

విద్యార్థులు స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన వార్డెన్

 

ఆదిలాబాద్ నవంబర్ 16(ప్రజాక్షేత్రం):విదార్థుల ఆలనా పాలన చూడాల్సిన హాస్టల్ వార్డెన్ వారిపై దారుణానికి తెగబడ్డాడు. విద్యార్థులు స్నానం చేస్తుండగా, చాటుగా ఆ వీడియోలు తీసాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాంద్‌పల్లి ఆశ్రమ పాఠశాలలో వార్డెన్‌గా పనిచేస్తున్న జి.ఆనందరావు హాస్టల్లో బాలికలు స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు తీశాడు. ఇటీవల ఆ పాఠశాలకు వచ్చిన షీ టీమ్‌ అవగాహన కార్యక్రమంలో బాలికలు ఈ విషయం షీ టీమ్ అధికారులకు చెప్పారు. ఈ ఘటనపై షీ టీమ్ పోలీసులు బేల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి ఆనందరావుపై పోక్సో కేసు వేసి శనివారం రిమాండ్‌కు పంపించారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అంబాజీ అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు.

Related posts