బీజాపూర్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
మొయినాబాద్ నవంబర్ 21(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలోని కనకమామిడి గేటు వద్ద రోడ్డు ప్రమాదం. రెండు కార్లు ఎదురు ఎదురు వచ్చి ఢీకొనడంతో ఒకరు స్పాట్ లోనే చనిపోయారు. 9 మందికి తీవ్ర గాయాలు. వారిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ బీజాపూర్ రహదారిపై నిరంతరం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఈ నెలలో బస్సు ప్రమాదం మరువక ముందే నిన్న లారీ ప్రమాదం జరిగింది. ఈరోజు కారు ప్రమాదాలు వాహనదారులు రోడ్డు పనులను వేగవంతం చేయాలన్నారు. పదిమందిలో ఒకరు చనిపోయారు.
ఇద్దరికీ సీరియస్ గా ఉంది. 7 మందికి గాయాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
