ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం?
వేములవాడ నవంబర్ 25(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది కాంగ్రెస్ నేతలు అధికారులతో కలిసి వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంగళ వారం ఉదయం ఆయన పరిశీలించారు. అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ పార్టీ నేతలతో కలిసి గృహ సముదాయం వద్ద బేస్మెంట్ పై నిల్చోని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది కుంగి పోయింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్ కింద పడిపో కుండా పట్టుకోవడం తో పెద్ద ప్రమాదం తప్పింది. టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల నాణ్యత ఈ సంఘటన ప్రశ్నార్ధకంగా మారింది. నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు సైతం నష్టాలను తగ్గించుకునేందుకు నాసిరకం నిర్మాణాలు చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
