కూరగాయల మార్కెట్ ను పూర్తిస్థాయిలో పాత ఎమ్మార్వో ఆఫీస్ గ్రౌండ్ కు తరలించేలా చర్యలు తీసుకోండి
భీంగల్ డిసెంబర్ 01(ప్రజాక్షేత్రం):భీంగల్ పట్టణంలో ప్రతిరోజు జరిగే మార్కెట్,వారంలో సోమవారం జరిగే మార్కెట్ ను పూర్తిస్థాయిలో పాత ఎమ్మార్వో ఆఫీస్ స్థలంలోనికి తరలించాలని వ్యాపారస్తులు ధర్నాకు దిగారు. సుమంగళి చౌరస్తా నుండి అంగడి బజారుకు వెళ్లేదారిలో రోడ్లపై పలు దుకాణాల ముందర ప్రతిరోజు, సోమవారం అంగడి రోజు కూరగాయలు పెట్టి వారి దుకాణాలకు కష్టమర్లు రాకుండా, వారు కూడా తమ దుకాణానికి వెళ్లాలంటే పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందని, కూరగాయలు అమ్మిన తర్వాత వారి షాప్ ముందర కరాబైన కూరగాయలు పోసి వెళుతున్నారని వారు మీడియాతో వాపోయారు.ఈ సందర్భంగా ధర్నా చేస్తున్న వ్యాపారస్తులు మాట్లాడుతూ కూరగాయలు అమ్మేవారు అందరూ అక్కడికి వెళ్లారని, కేవలం మూడు కూరగాయల షాపు వాళ్లు మాత్రం వెళ్లడం లేదని అన్నారు. ప్రొద్దున నుండి తిండి తిప్పలు లేకుండా దాదాపు 200 మంది వ్యాపారస్తులు ధర్నాలో పాల్గొనడం జరిగిందని అన్నారు. కేవలం 3 కూరగాయల షాపులను అక్కడికి తరలించడంలో మున్సిపల్ కమిషనర్, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మూడు షాపులను తరలించడంలో ఇంత ఇబ్బంది అవుతుందని మేము దాదాపుగా 200 మందిమి కూర్చున్న వారికి పట్టింపు లేదని అన్నారు.ఇక్కడ సరైన స్థలం లేకుండా, ఇరుకుగా ఉండడం వల్ల దొంగతనాలు జరుగుతున్నాయని, స్త్రీలకు సరైన మూత్రశాలలు లేవని, బస్టాండ్ లో పెద్ద ట్రాఫిక్ సమస్య ఉంటుందని,స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్లాలంటే కూడా ఇబ్బంది అవుతుందని తాము కనీసం 20 సార్లు కమీషనర్ కు లెటర్ ఇవ్వడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడంలేదని అన్నారు.సంవత్సరం నుండి వ్యాపారస్తులను మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పుతూనే ఉన్నారని వారు అన్నారు. వ్యాపారస్తులకు బిజెపి, కాంగ్రెస్,బి ఆర్ఎస్
పార్టీలు మద్దతు తెలిపాయి.భీంగల్ సిఐ సత్యనారాయణ గౌడ్,ఎస్సై కే సందీప్ హుటాహుటిన అక్కడికి చేరుకొని వ్యాపారస్తులతో మాట్లాడి వారిని అదుపు చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు. భీంగల్ మున్సిపల్ లో ట్రైనింగ్ లో ఉన్న ఐఏఎస్ అధికారిని కరోలిన్ చింగ్తియాన్మవి, మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్, తహసిల్దార్ షబ్బీర్, ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి వ్యాపారస్తుల వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరిస్తాం అనడంతో వారు వెళ్లారు.
– జాతరను తలపిస్తున్న సోమవారం అంగడి
భీంగల్ లో వారంలో సోమవారం నాడు జరిగే అంగడిని పాత ఎమ్మార్వో ఆఫీసు స్థలంలోకి మారడంతో కూరగాయలు,పండ్లు,నిత్యవసర సరుకులను కొనుగోలు చేయడానికి వచ్చిన జనాన్ని చూస్తే జాతరాను తలపిస్తున్నది.భీంగల్ సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లైటింగ్ ఏర్పాటు చేసి, మొరం వేయించడం జరిగిందని సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నీలం రవి తెలిపారు. ఇకనుండి ప్రతిరోజు కూరగాయలను ఇక్కడనుండి తీసుకోవాలని గ్రామ ప్రజలను కోరారు. భీంగల్ బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య కొద్ది వరకు తగ్గిందని ఆ మూడు కూరగాయల దుకాణాలను కూడా ఇక్కడికి తరలిస్తే బాగుంటుందని భీంగల్ ప్రజలు కోరారు.
