పొద్దుటూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
-సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బండ లక్ష్మి, నర్సింహా
శంకర్ పల్లి డిసెంబర్ 02(ప్రజాక్షేత్రం):గ్రామ ప్రజల ఆశీర్వదిస్తే పొద్దుటూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి బండ లక్ష్మి, నర్సింహా అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామానికి చెందిన సర్పంచిగా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి, నర్సింహా మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన అన్నారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఆదర్శవంతమైన పాలన, మహిళా సాధికారతే లక్ష్యంగా ముందుకు తీసుకు వెళ్తానని అన్నారు. ప్రజలు ఆశీర్వదించి సర్పంచిగా గెలిపించే అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీ సుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
