రంగారెడ్డి కలెక్టరేట్లో ఏసీబీ దాడులు
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 04(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి కలెక్టరేట్ అసిస్టెంట్ డైరక్టర్ సర్వే, ల్యాండ్స్ రికార్డు ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏడీ సర్వేయర్ శ్రీనివాస్ కు చెందిన గచ్చిబౌలిలోని మైత్రి హోమ్స్ లోని ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో 3 బృందాలుగా హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
