విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బండల ఇల్లు దగ్ధం ఎన్కతల లో ఘటన
– పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
– ప్రభుత్వం కొత్త ఇల్లును మంజూరు చేయాలి
వికారాబాద్ జిల్లా, డిసెంబర్ 05(ప్రజాక్షేత్రం):మోమినిపేట్ మండల పరిధిలో ఎన్కతల గ్రామంలో హరిజనవాడ స్కూల్ దగ్గరలో శుక్రవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయింది ఇంటిలో ఉండే గృహప్రకరణాలు, బీరువాలో ఉన్న దుస్తులు, మూడు తులాల బంగారం ఫర్నిచర్ కాలి బూడిద అయ్యింది బాధితులు తెలిపిన కథనం ప్రకారం జంగిలి సుశీల లక్ష్మయ్య దంపతులు ఆరోగ్యం బాగా లేనందున ఓ ధవాఖాన కు వెళ్లారు. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యులేట్ తో బండల ఇల్లు కాలిపోయింది, తినే బండారాలు పూర్తిగా దగ్ధమయ్యాయి గ్రామస్తులు గమనించి నీటితో మంటలను ఆర్పేశారు. జంగిలి లక్ష్మయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇల్లు కట్టించాలని ప్రభుత్వాన్ని గ్రామస్తుల కోరుతున్నారు.
