కాంగ్రెస్ కు షాక్ బిఆర్ఎస్ లో పార్టీలో చేరిన నీలం నరేందర్.
వలిగొండ డిసెంబర్ 05(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందిన వలిగొండ మాల మహానాడు మండల మాజీ అధ్యక్షులు గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ పోలేపల్లి రమేష్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మాజీ భువనగిరి శాసనసభ్యులు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల బిసి సెల్ ప్రచార కార్యదర్శి గాజుల ఆంజనేయులు మత్స్యగిరిగుట్ట మాజీ ఆలయ ధర్మకర్త గుండు స్వామి. మాజీ సర్పంచ్ సంగిశెట్టి లక్ష్మమ్మ చంద్రయ్య, పార్టీ నాయకులు సంగపాక స్వామి, నీలం రాములు, వడ్డేబోయిన నరేష్, తదితరులు పాల్గొన్నారు.
