ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు – నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు
హైదరాబాద్ డిసెంబర్ 17(ప్రజాక్షేత్రం):తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు తీర్పు వెలువరించనున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్ కోర్టులో తీర్పు వెలువరించనున్నారు. శాసనసభ వెబ్‌సైట్‌లో తీర్పు ప్రతులను అధికారులు అప్‌లోడ్ చేయనున్నారు. సుప్రీంకోర్టులో మరోమారు విచారణ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలుమార్లు కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 19న సుప్రీంకోర్టులో మరోమారు విచారణ జరగనుంది. నాలుగు వారాల్లోగా తేల్చాలని గత నెలలో ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించనున్నారు.
