ఏసీబీ అధికారులకు చిక్కిన రెవిన్యూ ఇన్స్పెక్టర్ కామేశ్వరీ!
ఖమ్మం జిల్లా డిసెంబర్18(ప్రజాక్షేత్రం):రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొందరు అవినీతి అధికారులు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే దురాశతో పేద రైతుల్ని ప్రజల్ని,వేధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ కామేశ్వరి, ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. కారేపల్లి ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం ఆర్ఐ దౌలూరి శుభ కామేశ్వరి దేవీ పది వేలు లంచం తీసుకుంటుండగా డిఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో ఆమెను ఎసిబి అదికారులు పట్టుకున్నారు. కారేపల్లిలో ఇంటి వద్ద ఆర్ఐను అధికారులు పట్టుకున్నారు. ఆర్ఐ ఇంట్లో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో కూడా రెవెన్యూ ఇన్స్పెక్టర్ కామేశ్వరీ లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
