మరకత శివలింగానికి పూజలు చేసిన సినీ దర్శకుడు బోయపాటి శ్రీను
శంకర్ పల్లి డిసెంబర్ 22(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో వెలసిన మరకత శివలింగానికి ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను సోమవారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1000 సంవత్సరాల ఆకుపచ్చ రంగుల శివలింగానికి పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. 11వ శతాబ్దంలో చాణుక్య రాజులు ఈ శివలింగాన్ని ప్రతిష్టించడం జరిగిందని, అయితే చందిప్ప గ్రామస్తులు ఆ శివలింగాన్ని భద్రంగా చూసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పచ్చని పొలాల మధ్య శివాలయం ఉండడం వచ్చిన భక్తులకు ఆహ్లాదకరంగా ఉంటుందని తెలిపారు. పూజల అనంతరం దేవాలయ దేవాలయ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి బోయపాటి శ్రీనుకు శివలింగం గల చిత్రపటాన్ని అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు సాయి శివ, అర్చకులు ప్రమోద్ దేవాలయ కమిటీ జనరల్ సెక్రెటరీ జనార్ధన్, అన్నదాన సత్రం చైర్మన్ దర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
