ఇందుర్తి గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం
కరీంనగర్, డిసెంబర్ 22(ప్రజాక్షేత్రం):చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ చింతపూల నరేందర్, ఉపసర్పంచ్ చింతపూల అనిల్,వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం గ్రామ పంచాయతీ లో సర్పంచ్, వార్డు సభ్యులను, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి చెల్పూరి విష్ణమాచారీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించాడు. ఈ కార్యక్రమం సంబంధిత గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో, ప్రభుత్వ నిబంధనలు, చట్టపరమైన మార్గదర్శకాల ప్రకారం జరిగాయని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి చెల్పూరి విష్ణమాచారి వెల్లడించాడు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రజా ప్రతినిధులు గ్రామ సమగ్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేయాలని అధికారులు సూచించారు. ప్రజాస్వామ్య విలువలను పటిష్టం చేసే దిశగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కీలకమైనదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పత్రికా ప్రతినిధులు, ప్రజలు కార్యక్రమన్ని విజయవంతం చేశారని అధికారులు అన్నారు.
