రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బోల్తా
బూర్గంపహాడ్ జనవరి 02(ప్రజాక్షేత్రం):ఇంజనీరింగ్ కాలేజీ బస్సు అద్భుతప్పి బోల్తాపడిన ఘటన బూర్గంపాడు మండల పరిధిలోని కృష్ణసాగర్ ఆటవి ప్రాంతంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ అడివి ప్రాంతం చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన కారణంగా ఒక్కసారిగా బోల్తా పడింది ఈ దుర్ఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదంలో రక్తం పడుతున్న శరీరాలలు భయంతో వణికిపోతున్న విద్యార్థులని చూసి ప్రత్యక్ష సాక్షులు కన్నీటి పర్యంతమయ్యారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆ దారిలో వెళ్తున్న ప్రయాణికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన విద్యార్థులను అత్యవసర వాహనాల్లో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
– తల్లిదండ్రుల ఆవేదన
ప్రమాద విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనతో ఆసుపత్రికి పరుగులు తీశారు తమ పిల్లలు క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థించారు. విద్యాసంస్థల బస్సులు పర్స ప్రమాదాలకు గురి కావడంపై సర్వత్ర విమర్శలు పెట్టమవుతున్నాయి యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
