Praja Kshetram
క్రైమ్ న్యూస్

లంచం తీసుకుంటూ కొల్లూరు ఎస్ఐ ఎసిబి ట్రాప్‌లో చిక్కాడు!

లంచం తీసుకుంటూ కొల్లూరు ఎస్ఐ ఎసిబి ట్రాప్‌లో చిక్కాడు!

 

హైదరాబాద్, జనవరి 02(ప్రజాక్షేత్రం):సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఎం. రమేష్ లంచం డిమాండ్ చేస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారుల ట్రాప్‌లో పడ్డాడు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని కొల్లూరు రక్షకభట నిలయంలో నమోదైన కేసులో ఫిర్యాదుధారి పేరు తొలగించేందుకు రూ.30,000 లంచం కోరాడు. అధికారుల వెల్లడి ప్రకారం, ఎస్‌ఐ ఇప్పటికే రూ.5,000 తీసుకుని, మిగిలిన మొత్తం నుంచి రూ.20,000 లంచం పొందుతున్న సమయంలో ఎసిబి జాలంలో చిక్కాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టారు.

Related posts