Praja Kshetram
తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు విడుదల.

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులు విడుదల.

 

 

తెలంగాణ బ్యూరో జనవరి 13(ప్రజాక్షేత్రం):ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఎల్-3 కేటగిరీ లబ్ధిదారుల బిల్లులను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న అనంతరం అర్హులైన సుమారు 1,072 మంది లబ్ధిదారులకు రూ.12.17 కోట్ల బిల్లులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరంగల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ బిల్లుల చెల్లింపు అంశాన్ని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

Related posts