ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు.. కేబినెట్ ఆమోదం
తెలంగాణ బ్యూరో జనవరి 18(ప్రజాక్షేత్రం):మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కాగా సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే జిల్లాల పునర్విభజనకూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
