Praja Kshetram
తెలంగాణ

ఖబర్దార్ కాలే యాదయ్య… నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు: భీం భారత్

ఖబర్దార్ కాలే యాదయ్య… నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు.

 

– కాలే యాదయ్య ఆరోపణలకు భీం భరత్ ఘాటైన కౌంటర్

– మామూళ్ల ఆరోపణలపై మీడియా సాక్షిగా భీం భరత్             బహిరంగ సవాల్

– మామూళ్లు ఎక్కడ-ఎప్పుడు ఇచ్చావో చెప్పాలి.

– లేదంటే చేవెళ్ల అంబేద్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకు     రాసి క్షమాపణ చెప్పాలి.

– షాబాద్ లో ఎదురైన ఘటనలే ప్రతి చోట చూస్తావ్

– కాంగ్రెస్ పెద్దలు నాకు ఇచ్చిన హామీని గౌరవిస్తున్నా

– కాలే యాదయ్య చేవెళ్లలో చేసిన అక్రమాలపై నోరు మూసుకున్నాను.

– ఇలాగే వ్యవహరిస్తే చేవెళ్లలో నువ్వు ఎట్లా తిరుగుతావో చూస్తా

మొయినాబాద్ జనవరి 18(ప్రజాక్షేత్రం):అటు ఇటు కానీ కాలే యాదయ్య నాకు గత పదేళ్లుగా తన వద్ద మామూళ్లు తీసుకున్నాడని ఆరోపించగా, దీనిపై స్పందిస్తూ భీం భరత్ ఆదివారం మొయినాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఘాటైన కౌంటర్ ఇచ్చారు. భీం భరత్ మాట్లాడుతూ, తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఖండించారు. “నిజంగా నీకు దమ్ము, ధైర్యం ఉంటే నేను మామూళ్లు తీసుకున్నానని చెబుతున్న ఆధారాలను బహిరంగంగా బయట పెట్టాలి. ఎక్కడ, ఎప్పుడు, ఎంత ఇచ్చావో చెప్పాలి. లేదంటే చేవెళ్ల అంబేద్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాసి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. “ఖబర్దార్ కాలే యాదయ్య… నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు. నిరూపణకు నేను సిద్ధం. లేకపోతే ఇటీవల షాబాద్‌లో నీకు ఎదురైన సంఘటనలే ప్రతిచోట ఎదురవుతాయి” అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, అధిష్టానం చర్యలు తీసుకుంటే అంగీకరిస్తానని భీం భరత్ తెలిపారు. అయితే చర్యలు లేకపోతే చేవెళ్లలో కాలే యాదయ్య ఎలా తిరుగుతాడో చూస్తానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీ మేరకు ఇప్పటివరకు మౌనం పాటించానని, కానీ ఇకపై పార్టీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులను సహించబోనని భీం భరత్ చెప్పారు. ప్రతిరోజూ నియోజకవర్గం నుంచి వంద మందికి పైగా ప్రజలు తన వద్దకు వచ్చి సమస్యలు చెబుతుంటారని, అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. గతంలో తనకు సంబంధం లేని సంఘటనను ఆసరాగా చేసుకుని కాలే యాదయ్య తనపై పీడీ యాక్ట్ సహా అనేక కేసులు పెట్టించి తనను చంపేందుకు కుట్రలు చేశాడని భీం భరత్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల దయ, ఆశీర్వాదాలతోనే తాను ప్రాణాలతో బయటపడ్డానని అన్నారు.

Related posts