కంజర్వేషన్ జోన్ తో ఉక్కిరిబిక్కిరి…రైతుల గోడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి.
– కంజర్వేషన్ జోన్ ఎత్తివేతకు చొరవ చూపాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దుండిగల్ బీజేపీ వినతి
కుత్బుల్లాపూర్ జనవరి 18(ప్రజాక్షేత్రం):దుండిగల్ సర్కిల్ పరిధిలోని దుండిగల్ తాండాలో ఉన్న రాంకీ పవర్ ప్లాంట్‌ను కేంద్రమంత్రి జీ. కిషన్ రెడ్డి శుక్రవారం పర్యటించిన సందర్భంగా దుండిగల్ సర్కిల్ బీజేపీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. దుండిగల్ సర్కిల్ పరిధిలోని బౌరంపేట్, దుండిగల్, నాగులూరు, డి. పోచంపల్లి, బహదూర్‌పల్లి, మల్లంపేట్ గ్రామాలలో అమలులో ఉన్న కంజర్వేషన్ జోన్‌ను ఎత్తివేయాలని కోరుతూ దుండిగల్ సర్కిల్ బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం స్థానిక బిజెపి నాయకులు మాట్లాడుతూ ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు కంజర్వేషన్ జోన్ పరిధిలోకి రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు మంత్రికి వివరించారు. కంజర్వేషన్ జోన్ కారణంగా భూముల సాగు, అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో రైతుల జీవనాధారం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న మాస్టర్ ప్లాన్ ను తక్షణమే మార్చి రైతులకు అనుకూలమైన రీతిలో రూపొందించవలసి ఉంది.దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్, దుండిగల్, డి పోచంపల్లి,మల్లంపేట్,బహదూర్ పల్లి, గాగిల్లాపూర్,నాగులూరు, శంబిపూర్ రెవిన్యూ గ్రామాలని 3 డివిజన్లుగా విభజించి GHMC లో విలీనం చేసి రైతులమీద మరింత భారం మోపడం జరిగింది. అటు రైతు బంధుకు గాని, రైతు రుణమాఫీ కి గాని నోచుకోని పరిస్థితి ఇటు భూమి కంజర్వేషన్ జోన్ నుండి మల్టిపర్పస్ జోన్ మార్చకుండా కుటుంబం పెరిగి చిన్న ఇల్లు గాని నిర్మించుకొందాం అంటే జోన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు కావున దయచేసి రైతులు తరపున దుండిగల్ మున్సిపల్ బీజేపీ ఆధ్వర్యంలో కంజర్వేషన్ జోన్ నుండి మల్టిపర్పస్ జోన్ మార్పిడికి కృషి చేసి రైతులను ఆదుకోగలరని కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జి అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి, మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి విగ్నేశ్వర్, నాయకులు గోనె మల్లారెడ్డి,ఎంబరి ఆంజనేయులు ముదిరాజ్,దమ్మగారి ప్రభాకర్ రెడ్డి, డి. సీతారాంరెడ్డి,తురాయి భాను గౌడ్,నర్సింగ్ రావ్,ఆర్ నర్సింహా చారి,ఏ శ్రీనివాస్ యాదవ్,ఎం అతీష్ బాబు,ఎం వెంకటేష్ నాయక్, శివనాయక్, విజయ్ నాయక్, రోహిత్ నాయక్, శ్రీను నాయక్, శంకర్ నాయక్, క్యాసారం రాజు,సుడే బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
