తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు
చిగురుమామిడి ,జనవరి 28 (ప్రజాక్షేత్రం) : తాటి చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడి ఓ గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని ఉల్లంపల్లి గ్రామానికి చెందిన సుధగోని సుదర్శన్ గౌడ్ (58) బుధవారం ఉదయం కల్లు గీసేందుకు చెట్టెక్కారు. ఈ క్రమంలో కాలు జారి కింద పడటంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన సుదర్శన్ గౌడ్‌ను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని సర్పంచ్ శంకర్ తో పాటు గౌడ సంఘం జిల్లా నాయకుడు సుధగోని రాజు గౌడ్ విజ్ఞప్తి చేశారు.
