Praja Kshetram
తెలంగాణ

బూర్గంపాడు సీహెచ్సీలో వైద్యుల సమయస్పూర్తి.

బూర్గంపాడు సీహెచ్సీలో వైద్యుల సమయస్పూర్తి

బూర్గంపాడు సీహెచ్‌సీలో సురక్షిత ప్రసవం

ఇద్దరు చిన్నారులకు జన్మనిచ్చిన మడకం జోగి

బూర్గంపాడు జనవరి 29(ప్రజాక్షేత్రం):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) లో వైద్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక గిరిజన మహిళకు విజయవంతంగా ప్రసవం చేశారు.వివరాల్లోకి వెళ్తే ముల్కలపల్లి మండలం, ఉటాచెరువు గ్రామానికి చెందిన మడకం జోగి (భర్త విజయ్) బుధవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు అధికం కావడంతో 108 అత్యవసరం అంబులెన్స్ కు ఫోన్ చేశారు వెంటనే స్పందించిన అంబులెన్స్ సిబ్బంది హుటా హుటిగా అక్కడకు చేరుకున్నారు.సదరు మహిళను వెంటనే బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితిని గమనించిన డ్యూటీ డాక్టర్ మరియు నర్సింగ్ సిబ్బంది వెనువెంటనే స్పందించి ఆమెకు వైద్యం అందించారు. సురక్షితమైన ప్రసవం అనంతరం ఆమె ఇద్దరు చిన్నారులకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి మరియు ఇద్దరు బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం అందించి, సురక్షితంగా డెలివరీ చేసిన వైద్య బృందాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు మరియు స్థానికులు అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందనడానికి ఈ ఘటన ఏ నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు.

Related posts