Praja Kshetram
తెలంగాణ

పట్టణమంతా శుభ్రంగా ఉండాలి: శంకర్ పల్లి కమిషనర్ శ్రీనివాస్

పట్టణమంతా శుభ్రంగా ఉండాలి: శంకర్ పల్లి కమిషనర్ శ్రీనివాస్

 

  • శంకర్ పల్లి ఏప్రిల్ 20 (ప్రజాక్షేత్రం): శంకర్‌పల్లి పట్టణమంతా శుభ్రంగా ఉండాలని కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. శనివారం మార్నింగ్ వాక్ లో కమిషనర్ దగ్గరుండి పారిశుద్ధ సిబ్బందితో రోడ్ల పక్కన చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, మట్టి కుప్పలు, రాళ్లు, ఇతర వ్యర్ధాలు లేకుండా తొలగించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ కాలనీలను, వార్డులను శుభ్రంగా మార్చాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న నాళాల పక్కన సైన్స్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts