2 కె రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
శంకర్‌పల్లి ఏప్రిల్ 22 (ప్రజాక్షేత్రం): ఈనెల 24న శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో జరిగే 2 కే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. కమిషనర్ మాట్లాడుతూ బుధవారం ఉదయం గం. 6:30 నిమిషాలకు ప్రధాన చౌరస్తా నుండి ప్రారంభమై పురవీధుల గుండా రైల్వే స్టేషన్ వరకు ఉంటుందన్నారు. యువజన సంఘాల సభ్యులు విద్యార్థులు పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు.